Header Banner

చంద్రబాబు ప్రగాఢ సానుభూతి! మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా!

  Thu Apr 24, 2025 09:59        Politics

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి, కావలి ఐటి ప్రొఫెషనల్ మధుసూదన్ ఉన్నారు.



బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతికకాయానికి  చంద్రబాబు నివాళి అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌తో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు.



 ఇది కూడా చదవండి: మాజీ మంత్రికి బిగ్ షాక్! ఆ కేసులోనే ఆమె మరిది అరెస్ట్ !

 

అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో ఇలాంటి దాడులకు తావు లేదని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను ఉగ్రవాద దాడులు ఏమీ చేయలేవని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి సమయంలో జాతీయ ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దాడిని వ్యవస్థీకృత నేరంగా, పక్కా ప్రణాళికతో కూడిన ఉగ్రవాద చర్య అని చెప్పారు. ఇది కేవలం వ్యక్తులపై జరిగిన దాడి కాదని, దేశ సమగ్రత, శాంతిపై చోటు చేసుకున్న కిరాతక దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుతంగా ఎన్నికలు జరగడం, అక్కడ పెరుగుతున్న ఉపాధి అవకాశాలు చూసి ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగించారని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, చేస్తోన్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించే ఎవరైనా కఠినమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని కోరారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తోన్న సమయంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడి చోటు చేసుకోవడం పట్ల చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత ప్రపంచ దేశాల్లో అగ్రస్థానానికి ఎదుగుతుందని, ఇటువంటి దాడులు దేశ పురోగతికి ఆటంకాలను కలిగిస్తాయని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దృఢ సంకల్పంతో తిప్పి కొట్టాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి: మద్యం స్కామ్’లో కీలక మలుపు! మరో కీలక నిందితుడి అరెస్ట్‌.. వైసీపీ నెట్‌వర్క్‌కి ఉచ్చు బిగుస్తుందా? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

లోక్‌సభ మహిళా సాధికారత కమిటీలో దక్షిణం నుంచి ఆ ముగ్గురు నేతలు! మహిళల అభివృద్ధికి కొత్త దిశ!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #chandrababu #exgratia #sympathy #exgratia families #support